![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామా.. మే 13న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ సినిమా పూర్తయ్యేలోపే లూసీఫర్ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు చిరు. మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది. ఈ లోపే మోహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళమ్ రీమేక్ ని పట్టాలెక్కించే దిశగా ప్రణాళిక జరుగుతోంది. అంతేకాదు.. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ నటించనున్న సినిమా కూడా ఈ ఏడాదిలోనే శ్రీకారం జరుపుకుంటుందని టాక్.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. దసరాకి చిరు - బాబీ కాంబినేషన్ మూవీ పూజ జరుపుకుంటుందని.. రెగ్యులర్ షూటింగ్ ఏడాది చివరలో ఆరంభమయ్యే అవకాశముందని తెలిసింది. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |