![]() |
![]() |

యాక్షన్ ఎంటర్టైనర్స్ తోనే కాదు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తోనూ విజయాలు చూశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 'వర్షం', 'డార్లింగ్' తరువాత 'రాధేశ్యామ్' కోసం మరోసారి లవర్ బాయ్ అవతారమెత్తారు ప్రభాస్. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. జూలై 30న విడుదల కానుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఒకే ఒక పాట బ్యాలెన్స్ ఉందని టాక్. ఈ పాటని ప్రభాస్, పూజా హెగ్డేపై ప్లాన్ చేశారట. అయితే అటు ప్రభాస్, ఇటు పూజ.. ఇద్దరు కూడా వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాళ్ళ కాల్షీట్స్ దొరికాకే.. ఈ సాంగ్ ని పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు రాధాకృష్ణ వేచిచూస్తున్నారట. అలాగే కొంత ప్యాచ్ వర్క్ కూడా బాకీ ఉందని సమాచారం.
కాగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్న 'రాధేశ్యామ్'లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జయరామ్ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నాడు. ఫిబ్రవరి 14న 'రాధేశ్యామ్' టీజర్ రిలీజ్ కానుంది. ఆ టీజర్ లోనే సినిమా విడుదల తేదిని కూడా ప్రకటించే అవకాశముందని బజ్.
![]() |
![]() |