![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం క్రాక్. ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైనా.. సంచలన విజయం సాధించిందీ పవర్ ఫుల్ కాప్ డ్రామా. కాగా, ఈ సినిమాకి పనిచేసిన ఓ సహాయక దర్శకుడికి కెప్టెన్ గా ఛాన్స్ ఇస్తున్నారట రవితేజ.
ఆ వివరాల్లోకి వెళితే.. క్రాక్ అసిస్టెంట్ డైరెక్టర్ గులాబి శ్రీను.. క్రాక్ చిత్రీకరణ సమయంలోనే రవితేజకి ఓ ఆసక్తికరమైన కథ చెప్పాడట. అది నచ్చడంతో.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారట రవి. తాజాగా.. ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసి ఇంప్రెస్ చేశాడట శ్రీను. దీంతో.. ఏడాది చివరకల్లా గులాబి శ్రీను దర్శకత్వంలో రవితేజ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం ఖాయమనే కథనాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. రవితేజ ప్రస్తుతం ఖిలాడి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. మే 28న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |