![]() |
![]() |

కరాటే కల్యాణి సినిమాల్లో కనిపించకుండా పోయింది. అప్పుడప్పుడు బుల్లితెర సీరియల్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చినా రెండు వారాల్లోనే హైస్ నుంచి బయటికి వచ్చేసింది. అప్పటి నుంచి టీవీ షోలల్లో తళుక్కున మెరుస్తున్న కరాటే కల్యాణి తాజాగా ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
"నన్ను నీలో కలుపుకో శివయ్యా.." అంటూ కల్యాణి పెట్టిన పోస్ట్ రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. కల్యాణి వైరాగ్యంతో ఈ పోస్ట్‌ని పెట్టిందా? లేక శివుడిపై వున్న భక్తితో పెట్టిందా అని ఆరా తీస్తున్నారు.
"నేను నీలో కలిసిపోదామని అనుకుంటూనే వున్నా. కానీ, నీకు నాకు మధ్య ఒక సన్నని తాడు వుంది. తెంచేద్దాం అనుకునేలోపు అర్థమైంది.. అమ్మ కడుపులో నుంచి ఆ తాడు నీ చేతిలోనే వుంది. ఏ రోజు ఏడ్చానో ఆరోజు కోసేసినా తెలియ రాలేదు చిత్రం! మళ్లీ కాలు చివరలు ముడివేసి తెంచేటప్పుడు తెలిసింది.. నేను తెంచుకోవాలి అనుకున్నా అది సాధ్యం కాదు.. నేను నిమిత్త మాత్రురాలిని కానీ భోళా శంకరా నిన్ను అడిగేది ఒక్కటే. మళ్లీ నీ ఆట మొదలుపెట్టకు.. తాడు లాగకు. నన్ను నీ దగ్గరే పెట్టుకో.. నన్ను నీలో కలుపుకో శివయ్యా.. అంతా శివమయం.. శివోహం.." అంటూ కరాటే కల్యాణి పెట్టిన పోస్ట్ మొదట కలవర పెట్టినా ఆ తరువాత శివుడిపై ఆమెకున్న భక్తి భావాన్ని అది తెలియజేస్తోంది.
![]() |
![]() |