![]() |
![]() |

'అ!, 'కల్కి' చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ లేటెస్ట్ ఫిల్మ్ 'జాంబీ రెడ్డి' ఫిబ్రవరి 5న విడుదలవుతోంది. ఈ సినిమాకు అతను సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఆ సీక్వెల్‌లో సమంత నటిస్తుందట. అలా అని లీక్ చేశాడు 'జాంబీ రెడ్డి' హీరో తేజ సజ్జా. ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడిన తేజ ఈ విషయాన్ని వెల్లడించాడు.
కొవిడ్ 19 బ్యాక్‌డ్రాప్‌లో 'జాంబీ రెడ్డి' స్క్రిప్ట్‌ను రాసుకున్న ప్రశాంత్ వర్మ దాని సీక్వెల్ స్క్రిప్ట్‌ను కూడా ఇప్పటికే రాసేశాడనీ, ఇప్పటికే ఆ స్క్రిప్ట్‌ను సమంతకు వినిపించాడనీ తేజ లీక్ చేశాడు. అంతే కాదు, 'జాంబీ రెడ్డి' రిలీజై, దాని ప్రమోషన్స్ క్లోజ్ అయ్యాక ఆ సీక్వెల్‌ను స్టార్ట్ చేస్తాడని కూడా అతను చెప్పాడు. అయితే సమంత ఆ సీక్వెల్‌ను చేయడానికి ఒప్పుకుందా, లేదా అనే విషయం మాత్రం అతను చెప్పలేదు. అంతే కాదు, 'జాంబీ రెడ్డి' బ్యాక్‌డ్రాప్ ఏమిటనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రశాంత్ వర్మ తన గత సినిమాలకు కూడా సీక్వెల్స్ ప్రకటించాడు కానీ, ఇంతవరకూ అవి కార్యరూపం దాల్చలేదు. మరి 'జాంబీ రెడ్డి' సీక్వెల్ అయినా సెట్స్ మీదకు వెళ్తుందేమో చూడాలి.
![]() |
![]() |