![]() |
![]() |

రీసెంట్ గా వరుస పెట్టి తమ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. లో-బడ్జెట్ మూవీస్ నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు నిర్మాణ దశలో ఉన్న పలు చిత్రాలకు సంబంధించి విడుదల తేదీలపై స్పష్టత వచ్చేసింది. ఫిబ్రవరి నుంచి వచ్చే సంక్రాంతి వరకు దాదాపు ఏడాది పాటు ప్రతీ నెలలోనూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ సందడి చేయనున్నాయి.
అయితే, వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నెల మాత్రం ఒకటుంది. అదే మే నెల. ఈ మాసంలో ఏకంగా నాలుగు బిగ్ టికెట్ ఫిలిమ్స్ థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. అది కూడా పోటాపోటీగా బరిలోకి దిగుతుండడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. మే 13న మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్ 'ఆచార్య' విడుదల కానుండగా.. మే 14న విక్టరీ వెంకటేష్ 'నారప్ప' రిలీజ్ కాబోతోంది. ఒక రోజు గ్యాప్‌లో ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పోటీకి దిగుతున్నాయి.
ఇక మే 28న నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'BB3' (వర్కింగ్ టైటిల్) తెరపైకి రానుండగా.. అదే రోజున మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి' సందడి చేయనుంది.
మరి.. వీటిలో ఏయే సినిమాలు బాక్సాఫీస్ విన్నర్స్ గా నిలుస్తాయో చూడాలి.
![]() |
![]() |