![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి స్టార్ రానా కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తొలుత పంద్రాగస్టు వారాంతంలో విడుదల చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే.. అదే సమయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ డేట్ (ఆగస్టు 13) కన్ఫామ్ చేసుకోవడంతో.. పవన్ మల్టిస్టారర్ వాయిదా పడిందన్న మాటలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
అదే గనుక నిజమైతే.. అన్ లక్కీ డేట్ కే పవన్ రాబోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. గతంలో ఇదే సెప్టెంబర్ 10న వచ్చిన గుడుంబా శంకర్ (2004), కొమరం పులి (2010).. రెండు కూడా తీవ్ర నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో.. మల్టిస్టారర్ తోనైనా ట్రాక్ రికార్డ్ మారుతుందేమో చూడాలి.
![]() |
![]() |