![]() |
![]() |

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన దబాంగ్ 3లో.. మున్నీ కా బద్ నామ్ రీమిక్స్ లో మెరిసిన తార వారినా హుస్సేన్. అంతకంటే ముందు సల్మాన్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కిన లవ్ యాత్రిలో నాయికగా నటించిన ఈ అమ్మడు.. ది ఇన్ కంప్లీట్ మ్యాన్ లోనూ హీరోయిన్. అయితే.. హిందీ చిత్ర సీమలో రీమిక్స్ మున్నిగానే పాపులర్ అయింది వారినా.
కట్ చేస్తే.. త్వరలో ఈ టాలెంటెడ్ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. అది కూడా.. ఓ క్రేజీ కాంబినేషన్ లో. ఆ వివరాల్లోకి వెళితే.. అరవింద సమేత వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యన్టీఆర్ 30గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ నాయికగా వారినా హుస్సేన్ ఎంపికైందని టాక్. ఇటీవల హైదరాబాద్ కు వచ్చి టెస్ట్ షూట్స్ లోనూ వారినా పాల్గొందని సమాచారం. త్వరలోనే యన్టీఆర్ 30లో వారినా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
యన్టీఆర్ ఆర్స్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |