![]() |
![]() |

టాలీవుడ్ లో ఎన్నడూ లేని విధంగా రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్స్ హవా నడుస్తోంది. వీటిలో ఎన్ని సినిమాలు సకాలంలో తెరపైకి వస్తాయో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం ఇదో హాట్ టాపిక్.
ఇదిలా ఉంటే.. తాజా ప్రకటనలను పరిశీలిస్తే కొందరు యువ కథానాయకులు బ్యాక్ టు బ్యాక్ మంత్ రిలీజ్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఆ యంగ్ హీరోస్ మరెవరో కాదు.. నితిన్, రానా, వరుణ్ తేజ్.
నితిన్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 19న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తాను నటించిన చెక్ చిత్రం రిలీజ్ కానుంది. మార్చి 26న వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ రంగ్ దే సందడి చేయనుంది. మొత్తంగా.. బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో నితిన్ సందడి చేయబోతున్నారన్నమాట.
ఇక రానా విషయానికి వస్తే.. మార్చి 26న అరణ్య రిలీజ్ కానుండగా.. ఏప్రిల్ 30న విరాట పర్వం రాబోతోంది. ఈ రెండు సినిమాలు కూడా అటవీ నేపథ్యంలో తెరకెక్కినవే కావడం విశేషం. అలాగే రానా నటించిన 1945 కూడా అటుఇటుగా సమ్మర్ సీజన్ లోనే రిలీజ్ కానుంది.
అలాగే వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. జూలై 30న స్పోర్ట్స్ డ్రామా గనితోనూ.. ఆగస్టు 27న హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న మల్టిస్టారర్ ఎఫ్ 3తోనూ పలకరించబోతున్నారు.
మరి.. ఈ బ్యాక్ టు బ్యాక్ మంత్ రిలీజెస్ ఈ యంగ్ హీరోలకి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
![]() |
![]() |