![]() |
![]() |

తెలుగునాట దాదాపు అగ్ర కథానాయలకుందరితోనూ కలిసి పనిచేసే అవకాశం దక్కింది యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కి. రీసెంట్ గా లూసీఫర్ రీమేక్ రూపంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా ఆఫర్ కొట్టేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ట్యూన్స్ ఇచ్చే అవకాశం దక్కిందట తమన్ కి.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ నాయిక. అయితే, ఇప్పటివరకు సంగీత దర్శకుడు ఎవరు అన్నదానిపై క్లారిటీ రాలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. తమన్ కి ఆ ఛాన్స్ దక్కిందట. సలార్ ని నిర్మిస్తున్న హొంబళే ఫిల్మ్స్ నుంచి రాబోతున్న యువరత్నకి తమన్ నే కంపోజర్. ఏప్రిల్ 2న ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ లోపే మరో బంపర్ ఆఫర్ ఇచ్చిందట సదరు నిర్మాణ సంస్థ.
మరి.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
కాగా, ప్రభాస్ కాంబినేషన్ లో తమన్ కిదే ఫస్ట్ ఫిల్మ్ కానుంది. పదేళ్ల క్రితమే రెబల్ రూపంలో అవకాశం దక్కినట్లే దక్కి మిస్సయింది. ప్రభాస్ ప్రీవియస్ మూవీ సాహో ప్రచార చిత్రాల్లో ఒకటైన షేడ్స్ ఆఫ్ సాహోకి తమన్ నే బీజీఎం ఇచ్చాడు. ఎట్టకేలకు.. ప్రభాస్ తో తమన్ కాంబినేషన్ సెట్ అవుతున్నట్టే. చూడాలి.. ఏం జరుగుతుందో?
![]() |
![]() |