![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఓ పిరియడ్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నారు పవన్.
ఇదిలా ఉంటే.. ఇందులో ఓ కథానాయికగా ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ నటిస్తుందని గత కొద్ది రోజులుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం ఇచ్చిన సమాచారం ప్రకారం.. పవన్ కి జోడీగా నిధి నటిస్తుండడం లాంఛనమే. అంతేకాదు.. రీసెంట్ గా ఇద్దరి పైనా సాంగ్ షూట్ కూడా జరిగిందట. అలాగే అభినయానికి అవకాశమున్న పాత్రలోనే నిధి కనిపించనుందన్నది రత్నం మాటలను బట్టి స్పష్టమవుతోంది.
మరి.. తన కెరీర్ లోనే బెస్ట్ ఆఫర్ అయిన ఈ సినిమాతో నిధి అగర్వాల్ దశ, దిశ మారిపోతాయేమో చూడాలి.
మొఘలాయిల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |