![]() |
![]() |

ఆగస్టు 2.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు. అంతేకాదు.. ఈ నెలలో రిలీజైన కొన్ని సినిమాలు డీఎస్పీకి సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి కూడా. బొమ్మరిల్లు (2006), జులాయి (2012), శ్రీమంతుడు (2015).. ఇలా వేర్వేరు సంవత్సరాల్లో విడుదలైన దేవిశ్రీ మ్యూజికల్స్ ఘనవిజయం సాధించాయి. అలాంటి లక్కీ బర్త్ డే మంత్ లో ఈ ఏడాది డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారీ రాక్ స్టార్.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఆగస్టు 13న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప విడుదల కాబోతోంది. ఇక అదే నెలలో రెండు వారాల తరువాత అంటే ఆగస్టు 27న దేవిశ్రీ ప్రసాద్ స్వరసారథ్యంలో తెరకెక్కుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ఎఫ్ 3 (విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులు) రాబోతోంది.
మరి.. తక్కువ గ్యాప్ లోనే రానున్న ఈ రెండు సినిమాలు డీఎస్పీకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తాయో చూడాలి.
![]() |
![]() |