![]() |
![]() |

ముంబైలో ఓ టాలీవుడ్ నటి డ్రగ్స్‌తో పట్టుబడటం కలకలం సృష్టించింది. శనివారం రాత్రి ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ హోటల్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడి చేసి, ఆ నటిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆమెతో పాటు చాంద్ మహమ్మద్ అనే డ్రగ్ పెడ్లెర్‌ను కూడా పట్టుకున్న ఎన్సీబీ, అతని దగ్గర్నుంచి 400 గ్రాములు నిషేధిత డ్రగ్ మెఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకుంది. వారికి డ్రగ్స్ సప్లై చేసిన సయీద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.
చాంద్ నుంచి స్వాధీనం చేసుకున్న మెఫెడ్రిన్ విలు రూ. 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత బాలీవుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దర్యాప్తు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అందిన పక్కా సమాచారం మేరకు శనివారం రాత్రి మీరా రోడ్‌లోని హోటల్‌పై దాడి చేసింది. అయితే పట్టుబడిన టాలీవుడ్ నటి పేరును అధికారులు వెల్లడించలేదు.
![]() |
![]() |