![]() |
![]() |

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటీమణుల్లో బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఒకరు. తాజాగా ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ నటించిన హిందీ చిత్రం త్రిభంగ. ఇందులో ఒడిస్సీ నాట్యకారిణిగా దర్శనమివ్వనున్నారామె. ముంబయి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథతో తెరకెక్కింది. కుటుంబ బంధాలకు, విలువలకు పెద్ద పీట వేస్తూ రూపొందిన ఈ సినిమాని ఒకప్పటి కథానాయిక రేణుకా సహానీ డైరెక్ట్ చేయడం విశేషం.
ఇందులో కాజోల్ తో పాటు తన్వీ ఆజ్మీ, మిథిలా పాల్కర్, కునాల్ రాయ్ కపూర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఇందులో కాజోల్ పలికించే భావోద్వేగాలు ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ నెల 15న నెట్ ఫ్లిక్స్ లో త్రిభంగ స్ట్రీమ్ కానుంది. మరి.. ఈ చిత్రంతో నటిగా కాజల్ కి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో తెలియాలంటే మరో రెండు వారాలు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |