![]() |
![]() |

2020 క్యాలెండర్ ఇయర్ లో కొంతమంది తారలు ఓటీటీ వేదికల్లోనే రెండు లేదా అంతకుమించి సినిమాలతో సందడి చేశారు. ఆ తారలెవరంటే..
సత్యదేవ్: ఈ టాలెంటెడ్ స్టార్ ఈ క్యాలెండర్ ఇయర్ మూడు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ఆ మూడు సినిమాలు కూడా ఓటీటీల్లోనే రిలీజవడం విశేషం. 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వ గోరింక.. ఇలా సత్యదేవ్ హీరోగా నటించిన మూడు చిత్రాలూ ఓటీటీ వేదికల్లోనే సందడి చేశాయి. వీటిలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్యకి ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేష్: మహానటితో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్న కీర్తి సురేష్.. ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరించారు. ఆ రెండు చిత్రాలు కూడా ఓటీటీ వేదికల్లో రిలీజయ్యాయి. పెంగ్విన్, మిస్ ఇండియా పేర్లతో ఓటీటీల్లో సందడి చేసిన ఈ చిత్రాలు నిరాశపరిచాయి.
సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్: ఈ ఇద్దరు కూడా ఈ క్యాలెండర్ ఇయర్ లో ఓటీటీ వేదికల్లోనే సందడి చేశారు. అది కూడా కలసి నటించిన సినిమాలతో. ఆ చిత్రాలే.. కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాధ వినుమా. వీటిలో కృష్ణ అండ్ హిజ్ లీల విమర్శకుల ప్రశంసలు అందుకోగా.. మా వింత గాధ వినుమా ఫర్లేదనిపించుకుంది.
![]() |
![]() |