![]() |
![]() |

ఇప్పుడంటే ఇండియన్ మూవీస్, కొరియన్ మూవీస్ లాంటివి కూడా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి కానీ.. ఒక దశాబ్దం క్రితం వరకూ కూడా హాలీవుడ్ సినిమాలే అన్ని చోట్లా రాజ్యం చేస్తూ వచ్చాయి. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్‌లో రూపొందడం, అమెరికా పెద్దన్నలాగా వ్యవహరించడం వల్ల అక్కడ నిర్మాణమయ్యే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంటుంది. ఈ వరల్డ్ మార్కెట్ కారణంగానే ఎంత బడ్జెట్‌తోనైనా సినిమాలు తీసే వెసులుబాటు హాలీవుడ్ నిర్మాతలకు కలుగుతోంది.
ఒక 'అవతార్' కానీ, ఒక 'అవెంజెర్స్' కానీ, ఇంకో 'స్టార్ వార్స్' కానీ.. అంతంత బడ్జెట్‌తో తియ్యడమంటే మాటలు కాదు.. వరల్డ్ మొత్తం మార్కెట్ ఉన్న సినీ ఇండస్ట్రీకే అది సాధ్యమవుతుంది. అందుకే పలు హాలీవుడ్ సినిమాలు టెక్నికల్‌గా ఆడియెన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంటాయి. అలా హాలీవుడ్ నుంచి వచ్చి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన టాప్ 10 సినిమాలేవో ఓసారి చూద్దామా.. అవి ఏ కాలానివైనా.. ఇప్పటి డాలర్ విలువకు తగ్గట్లు వాటి బాక్సాఫీస్ కలెక్షన్‌ను అడ్జెస్ట్ చేస్తే.. వచ్చిన రిజల్ట్ ఇది. ఈ గ్రేట్ ఫిలిమ్స్‌ను మీరు చూశారా.. ఇప్పటిదాకా చూడకపోతే వెంటనే చూసేయ్యండి...
10. స్టార్ వార్స్: ఎపిసోడ్ 7 - ద ఫోర్స్ అవేకిన్స్ (2015)

డైరెక్టర్: జె.జె. అబ్రామ్స్
తారాగణం: డైసీ రిడ్లీ, జాన్ బోయెగా, ఆస్కార్ ఇసాక్, హారిసన్ ఫోర్డ్
నేటి విలువ ప్రకారం సవరించిన బాక్సాఫీస్ కలెక్షన్: $2.2 బిలియన్
ఐఎండీబీ రేటింగ్: 7.9
9. డాక్టర్ ఝివాగో (1965)

డైరెక్టర్: డేవిడ్ లీన్
తారాగణం: ఒమర్ షరీష్, జూలీ క్రిస్టీ, గెరాల్డిన్ చాప్లిన్, రాడ్ స్టీగర్
నేటి విలువ ప్రకారం సవరించిన బాక్సాఫీస్ కలెక్షన్: $2.25 బిలియన్
ఐఎండీబీ రేటింగ్: 8.0
8. ద టెన్ కమాండ్‌మెంట్స్ (1956)

డైరెక్టర్: సెసిల్ బి. డెమెల్లే
తారాగణం: చార్ల్‌టన్ హెస్టన్, యుల్ బ్రిన్నర్, అన్నే బాక్స్‌టర్, ఎడ్వర్డ్ జి. రాబిన్సన్
నేటి విలువ ప్రకారం సవరించిన బాక్సాఫీస్ కలెక్షన్: $2.3 బిలియన్
ఐఎండీబీ రేటింగ్: 7.9
7. ఇ.టి. ది ఎక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్ (1982)

డైరెక్టర్: స్టీవెన్ స్పీల్‌బర్గ్
తారాగణం: హెన్రీ థామస్, డ్రూ బారీమోర్, పీటర్ కొయోటే, డీ వాలస్
నేటి విలువ ప్రకారం సవరించిన బాక్సాఫీస్ కలెక్షన్: $2.4 బిలియన్
ఐఎండీబీ రేటింగ్: 7.8
6. ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ (1965)

డైరెక్టర్: రాబర్ట్ వైజ్
తారాగణం: జూలీ ఆండ్రూస్, క్రిస్టఫర్ ప్లమ్మర్, ఎలీనార్ పార్కర్, రిచర్డ్ హేన్
నేటి విలువ ప్రకారం సవరించిన బాక్సాఫీస్ కలెక్షన్: $2.5 బిలియన్
ఐఎండీబీ రేటింగ్: 8.0
5. అవెంజర్స్: ఎండ్‌గేమ్ (2019)

డైరెక్టర్స్: ఆంథోనీ రుస్సో, జో రుస్సో
తారాగణం: రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, మార్క్ రఫలో, క్రిస్ హెమ్స్‌వర్త్
నేటి విలువ ప్రకారం సవరించిన బాక్సాఫీస్ కలెక్షన్: $2.9 బిలియన్
ఐఎండీబీ రేటింగ్: 8.4
4. స్టార్ వార్స్: ఎపిసోడ్ 4 - ఎ న్యూ హోప్ (1977)

డైరెక్టర్: జార్జ్ లూకాస్
తారాగణం: మార్క్ హామిల్, హారిసన్ ఫోర్డ్, కారీ ఫిషర్, అలెక్ గిన్నెస్
నేటి విలువ ప్రకారం సవరించిన బాక్సాఫీస్ కలెక్షన్: $3 బిలియన్
ఐఎండీబీ రేటింగ్: 8.6
3. టైటానిక్ (1997)

డైరెక్టర్: జేమ్స్ కామెరాన్
తారాగణం: లియొనార్డో డి కాప్రియో, కేట్ విన్‌స్లెట్, బిల్లీ జేన్, కేథీ బేట్స్
నేటి విలువ ప్రకారం సవరించిన బాక్సాఫీస్ కలెక్షన్: $3.2 బిలియన్
ఐఎండీబీ రేటింగ్: 7.8
2. అవతార్ (2009)
![]()
డైరెక్టర్: జేమ్స్ కామెరాన్
తారాగణం: సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, మిషెల్లే రోడ్రిగెజ్
నేటి విలువ ప్రకారం సవరించిన బాక్సాఫీస్ కలెక్షన్: $3.3 బిలియన్
ఐఎండీబీ రేటింగ్: 7.8
1. గాన్ విత్ ది విండ్ (1939)

డైరెక్టర్: విక్టర్ ఫ్లెమింగ్
తారాగణం: క్లార్క్ గేబుల్, వివియన్ లే, థామస్ మిచెల్, బార్బరా ఓ నీల్
నేటి విలువ ప్రకారం సవరించిన బాక్సాఫీస్ కలెక్షన్: $3.7 బిలియన్
ఐఎండీబీ రేటింగ్: 8.1
![]() |
![]() |