![]() |
![]() |

తెరపై లిప్ లాక్‌కు దూరంగా ఉంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మాత్రం ఆ పని చేయడానికి రెడీ అంటోంది. అవును. సమంత అక్కినేని టాక్ షో 'సామ్ జామ్'లో ఆమె ఈ విషయం స్వయంగా చెప్పింది. పాలమీగడ లాంటి శరీర వర్ణంతో మిలమిలా మెరిసిపోయే తమన్నాకు ఫ్యాన్స్ మిల్కీ బ్యూటీ అనే బిరుదు ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఒకటిన్నర దశాబ్దం క్రితం 'చాంద్ సా రోషన్ చెహ్‌రా'తో బాలీవుడ్‌లో, 'శ్రీ'తో టాలీవుడ్‌లో పరిచయమైన ఆమె, 2007లో శేఖర్ కమ్ముల సినిమా 'హ్యాపీ డేస్'తో ప్రేక్షకుల ఆరాధ్య తారగా మారింది. అప్పట్నుంచీ వెనుతిరిగి చూడకుండా వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు సంపాదించుకుంటూ వచ్చిన తమన్నా, 'బాహుబలి'లో అవంతిక పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను అలరించింది.
కాగా సమంత టాక్ షో సామ్ జామ్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో తమన్నా సందడి చేయబోతోంది. ఈ షోలో భాగంగా ఆమెను సమంత చేసిన ఇంటర్వ్యూ ఈ రోజే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రోమో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. లిప్ లాక్‌కు తాను విరుద్ధమని తమన్నా చెప్పడంతో, ఒకవేళ ఆన్ స్క్రీన్‌లో ఆ రూల్‌ను బ్రేక్ చేస్తే, ఎవరితో కిస్ సీన్ చేయాలనుకుంటావని సమంత అడిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండతో ఆ సీన్ చేయాలనుకుంటానని చెప్పింది తమన్నా. దాంతో ఆ షోలో పాల్గొన్న ఆడియెన్స్ గోల గోల చేశారు.
మొత్తానికి రౌడీ హీరో విజయ్ మిల్కీ బ్యూటీ మనసు దోచేసినట్లు ఉన్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందనీ, అందులో తప్పకుండా ఆ ఇద్దరికీ లిప్ లాక్ సీన్ ఉంటుందనీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్న మాట!
![]() |
![]() |