![]() |
![]() |

అరవింద సమేతతో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ అందుకున్నారు యంగ్ టైగర్ యన్టీఆర్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన తీరు నచ్చడంతో.. అతని కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తారక్. ఫలితమే.. యన్టీఆర్ 30. అరవింద సమేతని నిర్మించిన హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థతో పాటు యన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించనుంది.
వచ్చే ఏడాది వేసవి ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనున్న ఈ సినిమాకి ఆ మధ్య అయినా పోయి రావలె హస్తినకు అనే టైటిల్ బాగా ప్రచారంలోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. రాజా వచ్చినాడు అనే మరో టైటిల్ కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని టాక్. త్వరలోనే ఈ టైటిల్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. త్రివిక్రమ్ చిత్రాలు సింహభాగం అ అనే అక్షరంతోనే మొదలవుతాయి. అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో.. ఇలా ఓ పద్ధతి ప్రకారం తన సినిమాలకు పేర్లు పెడుతుంటారాయన. ఈ సారి తన సెంటిమెంట్ కి భిన్నంగా త్రివిక్రమ్ టైటిల్ పెట్టబోతున్నారనే అనుకోవాలి. త్వరలోనే రాజా వచ్చినాడు టైటిల్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
యన్టీఆర్ 30కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.
![]() |
![]() |