![]() |
![]() |

కరోనా టైమ్ లో ఇండియన్ సినిమా ఓటీటీ బాట పట్టింది. థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్న చాలా చిత్రాలకు ఓటీటీనే శరణ్యం అయింది. అయితే ఇలా విడుదలైన సినిమాల్లో హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. రీసెంట్ గా రిలీజైన తమిళ చిత్రాలు సూరరై పోట్రు, మూకుత్తి అమ్మన్ ని ఈ లిస్ట్ లో చేర్చుకోవచ్చు.
సూర్య కథానాయకుడిగా నటించిన సూరరై పోట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతోనూ.. నయన్ ప్రధాన పాత్రలో నటించిన మూకుత్తి అమ్మన్ తెలుగులో అమ్మోరు తల్లిగానూ విడుదల కాగా.. రెండు సినిమాలకూ రెండు భాషల్లోనూ మంచి స్పందన వచ్చింది. అంతేకాదు.. రెండు రోజుల గ్యాప్ లో దీపావళి కానుకగా విడుదలైన ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తో అటు సూర్య, ఇటు నయన్ ఇద్దరు కూడా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. మరి..మున్ముందు ఈ జాబితాలో ఇంకెంతమంది చేరతారో చూడాలి.
![]() |
![]() |