![]() |
![]() |

కరోనాకు ఎప్పటికీ వ్యాక్సిన్ రాదని ప్రముఖ తెలుగు హీరో, హిందూపూర్ శాసనసభ్యులు నటసింహం నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు జిష్ణు రెడ్డి నిర్మిస్తున్న 'సెహరి' సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన అనంతరం కరుణ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బాలకృష్ణ పలు సూచనలు చేశారు. ఎప్పటికీ కరోనా వ్యాక్సిన్ రాదని వ్యాఖ్యానించారు.
కరోనా నేపథ్యంలో చన్నీళ్ళతో ఎవరు స్నానం చేయవద్దని నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే ఛానళ్లలో ఉదయం నిద్రలేవగానే చన్నీళ్ళతో స్నానం చేయాలి అని ఏవేవో చెబుతున్నారనీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వేడినీళ్లతో స్నానం చేయడం మంచిదని బాలకృష్ణ జాగ్రత్తలు చెప్పారు.
ప్రజలందరూ మానసికంగా దృఢంగా ఉండాలని బాలకృష్ణ ధైర్యం చెప్పారు. కరుణ నేపథ్యంలో ఎవరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని అన్నారు. ఇంకా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ "బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా ఓ మహిళ బసవతారకం హాస్పిటల్ లో చేరింది. ఆపరేషన్ కి అంతా సిద్ధం చేయగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. రెండు వారాలు ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించిన తర్వాత ఆమెకు ఆపరేషన్ చేయడానికి మళ్లీ అంతా సిద్ధం చేయగా ఇన్ఫెక్షన్ సోకి కోమాలోకి వెళ్లారు. డాక్టర్ల కొందరు బ్రతకదని చెప్పారు. బ్రతుకుతుందని నేను అన్నాను. చికిత్స చేయమని చెప్పాను. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. అందువల్ల అందరూ ధైర్యంగా ఉండండి" అని అన్నారు. రోజూ ఉప్పు కలిపిన వేడి నీళ్లు పుక్కిలించమని ఆయన జాగ్రత్తలు చెప్పారు.
![]() |
![]() |