![]() |
![]() |

చిరంజీవి సినిమా ప్రయాణంలో 'రుద్రవీణ'ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల మధ్యలో ఆయనను కొత్తగా చూపించిన సినిమా అది. మంచి పేరు తెచ్చిపెట్టింది కూడా! అయితే, ఆర్ధికంగా ఆ సినిమా మెగా ఫ్యామిలీకి నష్టాల్ని మిగిల్చింది. ఆ సినిమాకు మెగాస్టార్ తమ్ముడు నాగబాబు నిర్మాత. సినిమా ప్లాప్ అయినప్పటికీ తెలుగునాట చాలా పల్లెల్లో స్ఫూర్తి నింపడం సంతోషాన్ని ఇచ్చిందని చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు 'రుద్రవీణ' ప్రస్తావన ఎందుకంటే... ఆ టైటిల్‌తో మెగా డాటర్ సుష్మితా కొణిదెల ఒక వెబ్ షో చేయబోతున్నారు.
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ తొలి ప్రయత్నంగా 'షూటవుట్ ఎట్ ఆలేరు' వెబ్ సిరీస్ నిర్మించారు. కిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న జీ5 ఓటీటీలో అది రిలీజ్ కానుంది. ఈసారి మేనమామ అల్లు ఫ్యామిలీకి చెందిన ఆహా కోసం 'రుద్రవీణ' పేరుతో వాళ్ళు ఓ వెబ్ షో చేస్తున్నారు. శనివారం జరిగిన ఈ విషయం వెల్లడించారు.
![]() |
![]() |