![]() |
![]() |

వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. జెంటిల్ మ్యాన్, అమీ తుమీ, సమ్మోహనం చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ 'వి' సినిమాతో అనూహ్య పరాజయాన్ని చూశారు. ఈ నేపథ్యంలో.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు ఓ ఇన్నోవేటివ్ సబ్జెక్ట్ ని రెడీ చేసుకున్నారట మోహనకృష్ణ.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇందులో సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తారని సమాచారం. ఇంద్రగంటి గత రెండు చిత్రాలు 'సమ్మోహనం', 'వి'లోనూ సుధీర్ హీరోగా దర్శనమిచ్చారు. ఇప్పుడు వరుసగా మూడోసారి వీరి కాంబినేషన్ లో సినిమా రానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు.
వాస్తవానికి ఇంద్రగంటి నెక్స్ట్ వెంచర్ అక్కినేని నాగచైతన్య కాంబోలో చేయాలి. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ డీలే అవుతోందని టాక్.
![]() |
![]() |