![]() |
![]() |

'వీర' మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఖిలాడి'. మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రంగమ్మత్త అనసూయని ఎంచుకున్నారని సమాచారం. పాత్ర నిడివి చిన్నదే అయినా.. ప్రాధాన్యం ఉన్నదని టాక్. త్వరలోనే 'ఖిలాడి'లో అనసూయ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
బుల్లితెరపై వ్యాఖ్యాతగా రాణించిన అనసూయ.. క్షణం, రంగస్థలం, యాత్ర తదితర చిత్రాల్లో నటిగా తనదైన ముద్ర వేశారు. సోగ్గాడే చిన్ని నాయనా, ఎఫ్ 2, విన్నర్ వంటి సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో సందడి చేశారు. ప్రస్తుతం 'ఆచార్య'తో పాటు 'రంగమార్తాండ' చిత్రంలో అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |