![]() |
![]() |

నటి కల్పికా గణేష్ ఉన్నారు కదా! 'ఆరెంజ్' చిత్రంలో జెనీలియా స్నేహితురాలిగా, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో సమంతకి అక్కగా, ఇటీవల 'పడి పడి లేచె మనసు' చిత్రంలో సాయి పల్లవి స్నేహితురాలిగా నటించారు. 'లూజర్' వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేశారు. ఆమెను కలవడానికి విశాఖ నుండి ఓ వీరాభిమాని హైదరాబాద్ వచ్చాడు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆధారంగా అడ్రస్ డీకోడ్ చేసి మరీ ఇల్లు పట్టుకుని కల్పికాను కలిశాడు.
ఇంతకీ కల్పికా గణేష్ వీరాభిమాని పేరు ఏంటో చెప్పలేదు కదూ! అతడి పేరు చందు. తనను వెతుకుతూ వచ్చిన చందూని కల్పిక చిన్న సైజ్ ఇంటర్వ్యూ చేశారు. "మీకు నేను గ్రేట్ ఫ్యాన్. మీ యాక్టింగ్ సూపర్. ఎక్స్ప్రెషన్లు కిరాక్ ఉంటాయి" అని చందు చెప్పుకొచ్చాడు. అతడు డిటెక్టివ్ ఏజెన్సీ లో ఉండాలని కల్పికా గణేష్ అన్నారు. ఆమె కోసం చందు గిఫ్ట్స్, ఫ్లవర్ బొకే కూడా తెచ్చాడు. అంతే కాదు.... ఆమెను దృష్టిలో పెట్టుకుని మూడు స్క్రిప్ట్స్ రాశాడట. వాటిని కూడా ఆమెకు చూపించాడు. ఇంకెప్పుడు ఇలా చేయవద్దని చందుకి చెప్పి పంపానని కల్పికా గణేష్ అన్నారు.

![]() |
![]() |