![]() |
![]() |

తెలుగునాట ఉన్న స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ లో మెహర్ రమేష్ ఒకరు. కంత్రి, బిల్లా, శక్తి, షాడో.. ఇలా మెహర్ రూపొందించిన సినిమాలన్నీ స్టైలిష్ గానే సాగాయి. అయితే వీటిలో బిల్లా ఒక్కటే మెహర్ కి ఓ మోస్తరు విజయాన్ని కట్టబెట్టింది. ఇక ఈ నాలుగు సినిమాల కంటే ముందు.. కన్నడలో 'అజయ్' ('ఒక్కడు' రీమేక్), 'వీరకన్నడిగ' ('ఆంధ్రావాలా' రీమేక్) రూపొందించి సక్సెస్ చూశారు మెహర్. సో.. తన ఫిల్మోగ్రఫీని అబ్జర్వ్ చేస్తే.. స్ట్రయిట్ ఫిల్మ్స్ కంటే రీమేక్సే మెహర్ కి మంచి రిజల్ట్స్ ని ఇచ్చాయని స్పష్టమవుతోంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఏడేళ్లకు పైగా గ్యాప్ తో మెహర్ మెగాఫోన్ పట్టి తెరకెక్కించనున్న సినిమా కూడా ఓ రీమేకే. తమిళ చిత్రం 'వేదాళమ్' ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించబోతున్నారు. తెలుగు నేటివిటికీ తగ్గట్టు మార్పుచేర్పులతో తెరకెక్కనున్న ఈ చిత్రం.. త్వరలోనే పట్టాలెక్కనుంది.
రీమేక్ మూవీస్ తో మంచి ఫలితాలనే అందుకున్న మెహర్... చిరు కాంబినేషన్ మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |