![]() |
![]() |

బాలీవుడ్ బ్యూటీ, 'అతిథి'లో మహేశ్ జోడీగా నటించిన అమృతా రావ్ మాతృత్వంలోకి అడుగుపెట్టింది. సోమవారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అమృత, ఆమె భర్త ఆర్జే అన్‌మోల్ ఆనందానికి అవధులు లేవు. తమ జీవితాల్లోకి లిటిల్ ప్రిన్స్ వచ్చిన విషయాన్ని ఆ ఇద్దరూ ఓ ప్రెస్ స్టేట్‌మెంట్ ద్వారా వెల్లడించారు. "ఈరోజు ఉదయం అమృతా రావ్, ఆర్జే అన్‌మోల్ మగబిడ్డకు స్వాగతం పలికారు. తల్లీ బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. కుటుంబం పారవశ్యంలో ఉంది. శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తెలిపిన అందరికీ అమృత, అన్‌మోల్ ధన్యవాదాలు తెలుపుతున్నారు." అని ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
ఆ తర్వాత సోమవారం సాయంత్రం అన్‌మోల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పుత్రోదయం కలిగిన విషయాన్ని ప్రకటించాడు. ఒక పిక్చర్ నోట్‌ను పోస్ట్ చేశాడు. "1-11-2020. Buoy o boy.. Yes, it is a 'boy! అమృత, బాబు ఇద్దరూ పర్‌ఫెక్ట్‌లీ ఫైన్. వెల్లువలా వస్తోన్న ప్రేమను చూస్తుంటే మాకు దీవెనలు అందుతోన్న ఫీలింగ్ కలుగుతోంది! థాంక్ యు. 11 సంవత్సరాల అనుబంధాన్ని పూర్తి చేసుకున్న వేళ, ఇంతకంటే బెటర్ గిఫ్ట్‌ను మేం ఆశించట్లేదు. బాబుకు పేర్లను, సూచనలను స్వాగతిస్తున్నాం. అమృతా రావ్ - ఆర్జే అన్‌మోల్!" అని అందులో రాసుకొచ్చాడు.

![]() |
![]() |