![]() |
![]() |

ప్రస్తుతం తెలుగిళ్లలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మహమ్మారికి భయపడకుండా చాలామంది ముహూర్తాలు పెట్టించుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పంజాబీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చందమామగా ముద్రవేసుకున్న కాజల్ అగర్వాల్ సైతం అక్టోబర్ 30న తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును ముంబైలో వివాహమాడింది. సినిమాల్లో తెలుగు పెళ్లిళ్లు ఎలా ఉంటాయో చూసిన కాజల్‌కు ఆ సంప్రదాయాలు బాగా నచ్చాయి. అందుకే తమ సొంత వివాహ సంప్రదాయాల్లో లేకపోయినా జీలకర్ర బెల్లంతో తమ పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని ప్రత్యేకంగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకొని, తెలుగు సంప్రదాయాన్ని గౌరవించింది.
కాగా లాక్‌డౌన్ టైమ్‌లో గౌతమ్‌తో తాను చేసుకున్న నిశ్చితార్ధానికి సంబంధించిన కొన్ని పిక్చర్లను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కాజల్. ఆ పిక్చర్స్‌లో సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పసుపుపచ్చ చీరలో గార్జియస్‌గా కనిపిస్తోందామె. మరోవైపు క్రీమ్ కలర్ షేర్వాణీలో గౌతమ్ హ్యాండ్సమ్‌గా అగుపిస్తున్నాడు. గమనించదగ్గ విషయమేమంటే తమ డ్రస్‌కు మ్యాచ్ అయ్యే ఫేస్ మాస్క్‌లను ఆ ఇద్దరూ పెట్టుకొని ఉండటం!

లాక్‌డౌన్ మధ్యలో అలాంటి స్టన్నంగ్ శారీని తన కోసం డిజైన్ చేసిన మనీష్ మల్హోత్రాను ఈ సందర్భంగా ప్రశంసించింది కాజల్. "నా కోసం ఈ అందమైన చీరను మీ టీమ్ చేత తయారు చేయించినందుకు థాంక్యూ మై డియర్ మనీష్ మల్హోత్రా. జూన్‌లో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతున్న కాలంలో, ఏదీ సాధ్యపడని స్థితిలో దీన్ని మీరు సాధ్యం చేశారు. నా నిశ్చితార్ధంలో భాగమైన మీ ఎఫర్ట్, హార్డ్‌వర్క్, ఆత్మీయతను నిజంగా ప్రశంసిస్తున్నాను. లాట్స్ ఆఫ్ లవ్" అని ఆమె రాసుకొచ్చింది.
.jpg)
![]() |
![]() |