![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ హోదాలో ప్రభాస్ చేస్తున్న తొలి రొమాంటిక్ ఫిల్మ్ 'రాధే శ్యామ్'. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. మల్టిలింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 వేసవిలో తెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే.. ఇందులో 'మైనే ప్యార్ కియా' ఫేమ్ భాగ్యశ్రీ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన పాత్ర తాలూకు షూటింగ్ పార్ట్ పూర్తిచేసినా.. ఏ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లో క్లారిటీ రాలేదు. కాగా తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తను ప్రభాస్ కి తల్లిగా కనిపిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు భాగ్యశ్రీ. మరి.. తల్లీకొడుకులుగా భాగ్యశ్రీ, ప్రభాస్ ఏ మేరకు రంజింపజేస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
![]() |
![]() |