![]() |
![]() |
.jpg)
చాలా మంది సెలబ్రిటీలు శాకాహారాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. మాంసాహారం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయనేది వారి వాదన. శాకాహారంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించవచ్చని వారు అనేక ఉదాహరణలతో చెబుతుంటారు. అలాంటి సెలబ్రిటీల్లో రకుల్‌ప్రీత్ సింగ్ ఒకరు.
నవంబర్ 1 ఆదివారం ప్రపంచ శాకాహార దినం సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పిక్చర్‌ను ఆమె పోస్ట్ చేసింది. అందులో ఆమె చుట్టూ శాకాహార పదార్థాలు.. బంగాళాదుంప, ఉల్లిపాయలు వంటివి.. ఉన్నాయి. చేతిలో వెల్లుల్లి ఎత్తిపట్టుకొని చూపుతూ ఉంది రకుల్. దాంతో పాటు "శాకాహారిగా నేను తింటానికి చాలా ఉన్నాయి. కేవలం పాలకూర అని నా అర్థం కాదు. శాకాహారిగా ఉండటం అనేది ఒక జీవనశైలి. అది డైట్ కానీ, వ్యామోహం కానీ కాదు. అది పప్పు, రోటీ, సబ్జీ లాంటిది. హ్యాపీ వరల్డ్ వేగన్ డే" అని రాసుకొచ్చింది.

ప్రస్తుతం రకుల్ టాలీవుడ్‌లో నితిన్ సరసన 'చెక్' సినిమాలో, క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నాయికగా నటిస్తోంది. ఆమె చేతిలో రెండు హిందీ సినిమాలు, రెండు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి.
![]() |
![]() |