![]() |
![]() |

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోగా శ్రీకాంత్ మంచి డిమాండ్‌లో ఉండేవాడనే విషయం తెలిసిందే. 'పెళ్లి సందడి' రోజుల్లో అతడికి మంచి క్రేజ్ ఉండేది. డిమాండ్ పడిపోయాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. తను హీరోగా చేస్తున్న రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవితో 'శంకర్‌దాదా ఎంబీబీఎస్', 'శంకర్‌దాదా జిందాబాద్' సినిమాల్లో ఏటీఎమ్‌గా కీలక పాత్ర చేశాడు. కోరి మరీ ఆ సినిమాల్లో ఆ క్యారెక్టర్ చేశాడు శ్రీకాంత్. ఆ తర్వాత చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌తోనూ ఓ సినిమా చేశాడు.. అది.. కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన 'గోవిందుడు అందరి వాడేలే'. ఆ మూవీలో చరణ్‌కు బాబాయ్‌గా బంగారి అనే క్యారెక్టర్ చేశాడు. ఒక విషయంలో తండ్రీకొడుకులిద్దరూ సేమ్ టు సేమ్ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు శ్రీకాంత్.
"చిరంజీవి ఎంత బాగా టైమింగ్ మెయిన్‌టైన్ చేస్తారో నాకు బాగా తెలుసు. పొద్దున్నే ఏడు గంటలకంటే ఏడు గంటలకు ఆయన సెట్స్ మీదుంటారు. ఇప్పటి జనరేషన్‌లో చాలామంది మెల్లిగా వెళ్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ రామ్‌చరణ్ కూడా అచ్చం చిరంజీవిగారి లాగే ఏడు గంటలకు సీన్ తీయాలంటేఏ ఆ టైమ్‌కు సెట్‌లో ఉంటాడు. ఆ అంకితభావం అతనిలో ఉంది. అలాగే సబ్జెక్ట్ మీద ఎంతో ఇన్‌వాల్వ్‌మెంట్ చూపిస్తాడు. ఆ విషయంలో ఇద్దరూ ఒకే రకంగా అనిపించారు" అని చెప్పాడు శ్రీకాంత్. ప్రస్తుతం అతను గురుపవన్ డైరెక్షన్‌లో ఒక బైక్ రైడింగ్ మూవీ చేస్తున్నాడు. అందులో భూమిక, సుమంత్ అశ్విన్‌తో అతను కలిసి పనిచేస్తున్నాడు.
![]() |
![]() |