![]() |
![]() |

పాశ్చాత్య దేశాల్లో హాలోవీన్ డేను అక్టోబర్ 31న జరుపుకుంటూ వస్తుంటారు. చర్చి సర్వీసుల్లో భాగంగా ఈ హాలోవీన్ డే మొదలైంది. ఆ రోజు దెయ్యాలు, భూతాల మాదిరిగా మేకప్ వేసుకొని, ఒకరినొకరు సరదాగా భయపెట్టుకుంటూ హ్యాపీగా గడుపుతుంటారు. ఆ పాశ్చాత్య సంస్కృతిని మనం కూడా వంటపట్టించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే కదా. మెగాస్టార్ చిరంజీవి మనవరాళ్లు కూడా భూతాల మాదిరిగా మేకప్ వేసుకొని మనల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు.
కావాలంటే చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ కూతురు నివృతి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆదివారం షేర్ చేసుకున్న పిక్చర్లు చూడండి. ఆ పిక్చర్లలో నివృతి, చిరంజీవి పెద్దకుమార్తె సుష్మిత కూతురు సంహిత భూతాల వేషధారణలోకి మారిపోయారు. ఒక పిక్చర్‌లో సంహిత కింద కూర్చొని భయపెట్టే చూపులతో మనవంక చూస్తుంటే, నివృతి నిల్చొని, తన వేషంతోనే భయపెడుతోంది. వాళ్లకు ఆ కాస్ట్యూమ్స్ వేసింది సుష్మిత అయితే, వేళ్లకు పెయింటింగ్స్ వేసింది శ్రీజ.
.jpg)
అందుకే "హ్యాపీ హాలోవీన్.. బాగా భయపెట్టే కాస్ట్యూమ్ తయారుచేసి, టెర్రిఫిక్ మేకప్ వేసిన సుష్మిత ఆంటీకి, నా గోళ్లకు పెయింటింగ్ వేసిన అమ్మ శ్రీజకు థాంక్ యు. ఐ లవ్ యు దెమ్ సో మచ్. దే ఆర్ సో హారిఫిక్. ఈ మహమ్మారి సమయంలో సురక్షితమైన, కానీ ఫన్‌గా ఉండే హాలోవీన్ పార్టీని ప్లాన్ చేసిన మా ఫ్యామిలీకి కృతజ్ఞతలు. ఐ లవ్ యు సో మచ్. మీ అందరూ హాలోవీన్‌ను బాగా చేసుకున్నారని ఆశిస్తున్నా" అని రాసుకొచ్చింది నివృతి.

.jpg)
![]() |
![]() |