![]() |
![]() |

సైఫ్ అలీఖాన్ వాళ్లది రాయల్ ఫ్యామిలీ. అతని తండ్రి నవాబ్ మహమ్మద్ మన్సూర్ అలీఖాన్ సిద్దిఖి పటౌడీ పేరుపొందిన క్రికెటర్ మాత్రమే కాదు, ఆయన ఒక నవాబ్ కూడా. ప్రస్తుతం సైఫ్ తన భార్య కరీనా కపూర్, కొడుకు తైమూర్ అలీఖాన్‌తో హర్యానాలోని తమ పూర్వీకుల ఇంట్లో గడుపుతున్నాడు. సైఫ్ పూర్వీకుల ప్యాలెస్‌ను చూసేందుకు రెండు కళ్లూ చాలవనిపిస్తుంటుంది. దాని లోపలి అందాలు అలాంటివి మరి. దాన్ని పటౌడీ ప్యాలెస్ అని పిలుస్తారు. తమ చేజారి పోయిన ఆ ప్యాలెస్‌ను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో తిరిగి దాన్ని సొంతం చేసుకోగలిగాడు సైఫ్.
పది ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగిన పటౌడీ ప్యాలెస్‌లో 150 గదులున్నాయి. వాటిలో ఏడు డ్రస్సింగ్ రూమ్‌లు, ఏడు బెడ్ రూమ్‌లు, ఏడు బిలియర్డ్ రూములు ఉన్నాయి. 2011లో మన్సూర్ అలీఖాన్ పటౌడీ చనిపోయాక ఆ ప్యాలెస్‌ను నీమ్‌రాణా హోటల్స్‌కు లీజుకు ఇచ్చారు. 2014 దాకా అందులో హోటల్ రన్ అయ్యింది. నీమ్‌రాణా హోటల్స్ పార్టనర్స్ అమన్ నాథ్, ఫ్రాన్సిస్ వాజియార్గ్ దానిని నడిపారు. అయితే ఫ్రాన్సిస్ చనిపోయాడు. కాంట్రాక్ట్ రద్దు చేసుకోడానికి అంతదాకా తను సంపాదించిన డబ్బును చెల్లించి, ఆ ప్యాలెస్‌ను తిరిగి దక్కించుకున్నాడు సైఫ్.
"వారసత్వంగా నేను పొందాల్సిన ఇంటిని కూడా నేను సినిమాల ద్వారా సంపాదించింన డబ్బుతో తిరిగి పొందాను. గతం లేకుండా మనం జీవించలేం. అందులో చరిత్ర, సంస్కృతి, అందమైన ఫొటోగ్రాఫ్‌లు, కొంత స్థలం ఉంది. ఇదో ప్రత్యేకమైన సంపద. కానీ అందులో వారసత్వం లేదు." అని చెప్పాడు సైఫ్. ఇప్పుడు పటౌడీ ప్యాలెస్ విలువ దాదాపు రూ. 800 కోట్లు!

![]() |
![]() |