![]() |
![]() |

ఐపీఎల్ 2020 సందర్భంగా భర్త విరాట్ కోహ్లీతో ప్రస్తుతం దుబాయ్‌లో గడుపుతోన్న అనుష్క శర్మ గర్భంతో ఉన్న ఫొటోలు ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసిన ఒక స్టన్నింగ్ సిలౌట్ పిక్చర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. సూర్యాస్తమయం టైమ్‌లో విరుష్క నీళ్లలో ఉండగా తీసిన ఆ పిక్చర్‌కు వచ్చిన రెస్పాన్స్ అద్వితీయం.

ఇప్పుడు అనుష్క తాజా చిత్రాలు మరోసారి ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. కంఫర్టబుల్ డ్రస్‌లో సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్నట్లు అనుష్క ఇచ్చిన పోజులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ పిక్చర్లను రిపోస్టులు చేస్తూ 'అనుష్కశర్మ' హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. ఒకతను "సందేహం లేదు.. she has all the grace and glow" అని రాయగా, మరొకతను ఆమెను 'సూర్యరశ్మి' అని అభివర్ణించాడు. "చెడు చూపుల నుంచి, దుష్ట జనుల నుంచి దేవుడు ఆమెను కాపాడుగాక" అని మరొకతను రాసుకొచ్చాడు.
.jpg)
![]() |
![]() |