![]() |
![]() |

నయనతార నాయికగా నటిస్తోన్న మలయాళం సినిమా 'నిళల్' షూటింగ్ సోమవారం ఎర్నాకులంలో మొదలైంది. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టును చిత్ర బృందం ప్రారంభించింది. నయనతార సరసన హీరోగా నటిస్తోన్న కుంచక్కో బోబన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. త్వరలో నయనతార యూనిట్‌తో కలవనుంది. అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ అప్పు ఎన్. భట్టతిరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 2019లో వచ్చిన 'లవ్ యాక్షన్ డ్రామా' మూవీ తర్వాత నయన్ నటిస్తోన్న మలయాళం సినిమా ఇదే.
స్కిప్ట్‌ను నూతన రచయిత ఎస్. సంజీవ్ రాయగా, సూరజ్ ఎస్. కురుప్ సంగీతం సమకూరుస్తున్నాడు. దీపక్ డి. మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. నయన్, బోబన్ కలిసి ఇదివరకు 'ట్వంటీ-20' సినిమా చేశారు. అయితే అందులో ఆ ఇద్దరివీ అతిథి పాత్రలు. ఇప్పుడు 'నిళల్' మూవీలో తొలిసారిగా వారు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
![]() |
![]() |