![]() |
![]() |

కరోనా మహమ్మారి కాలంలో నిర్మాతలకు సపోర్ట్‌గా యాక్టర్లు, టెక్నీషియన్లు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాల్సిందిగా విఖ్యాత దర్శకుడు భారతీరాజా రిక్వెస్ట్ చేశారు. తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఆర్జిస్తోన్న నటులు, టెక్నీషియన్లు 30 శాతం తమ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోవాల్సిందిగా ఆయన కోరారు.
"కరోనా ప్రభావంతోత తమిళ సినిమా సవాళ్లతో కూడిన అనేక పరిస్థితులను ఎదుర్కొంటోంది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు తమ డబ్బును రికవర్ చేసుకోవడానికి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి స్థితిలో, నిర్మాణంలో ఉన్న సినిమాల, లేదా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయిన నిర్మాతలకు సాయం అందించడానికి ముందుకు రావాల్సిన బాధ్యత అందరు యాక్టర్లు, టెక్నీషియన్లపై ఉంది. తమ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో కనీసం 40 నుంచి 50 శాతం తగ్గితేనే నిర్మాతలు తమ సినిమాలను ఇబ్బందులు లేకుండా విడుదల చేసుకోగలిగి, ఈ విపత్కర స్థితి నుంచి బయటపడ గలుగుతారు. అప్పుడే, తమ సినిమాలకు పెద్ద ఆదాయాలు రాకపోయినప్పటికీ, వారు ఎక్కువ నష్టం లేకుండా బయటపడ గలుగుతారు" అని ఆయన చెప్పారు. ఆ స్టేట్‌మెంట్‌ను తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ షేర్ చేసింది.
![]() |
![]() |