![]() |
![]() |

వరుసబెట్టి సినిమాలు తీసుకుంటూ వెళ్తోన్న రామ్‌గోపాల్ వర్మ.. సోమవారం తన తొలి చిత్రం 'శివ' సెట్స్‌పై హీరో నాగార్జున, తను ఉన్న ఒక పిక్చర్‌ను ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. టాలీవుడ్‌లోని కల్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందిన 'శివ' విడుదలై నేటికి 31 సంవత్సరాలు నిండాయి. ఆ ఫొటోలో వర్మ ఒక సీన్ గురించి వివరిస్తుంటే, నాగ్ శ్రద్ధగా ఆయనను ఆలకిస్తున్నాడు. వర్మ ముందు టేబుల్‌పై టీ గ్లాసులున్నాయి.
ఆ పిక్చర్‌ను షేర్ చేసిన వర్మ, "శివ సెట్స్ నుంచి ఒక మూమెంట్" అనే క్యాప్షన్ రాశారు. ఆ పిక్చర్‌లో వర్మ ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉంటే (ఇప్పటితో పోలిస్తే), నాగ్ ఎప్పటిలా యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. నటుడు ఉత్తేజ్ కూడా ఆ ఫొటోలో ఉన్నాడు. నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ ఇద్దరి కెరీర్‌లోనూ 'శివ' అత్యంత ముఖ్యమైన సినిమా. తర్వాత కాలంలో నాగార్జున నిజ జీవిత భాగస్వామిగా మారిన అమల ఈ చిత్రంలో హీరోయిన్. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడమే కాకుండా, ట్రెండ్‌సెట్టర్‌గా, టాలీవుడ్‌లోని బెస్ట్ యాక్షన్ ఫిలిమ్స్‌లో ఒకటిగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకుంది.
వీఏసీ కాలేజీలో కొత్తగా చదువుకోవడానికి వచ్చిన శివ (నాగార్జున) అక్కడ బయటి నుంచి వచ్చిన గ్యాంగ్‌స్టర్ల ముఠా పెత్తనం, కాలేజీ వాతావరణాన్ని హింసాత్మకంగా మార్చే దాని చర్యలు చూసి సహించలేక, ఆ ముఠాను ఎదిరిస్తాడు. కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతాడు. గ్యాంగ్‌స్టర్ల లీడర్ భవానీ (రఘువరన్)తో చేసే పోరాటంలో అతను ఎలా విజయం సాధించాడనేది కథలోని ప్రధానాంశం.

ఇలాంటి కల్ట్ క్లాసిక్‌కు ప్రీక్వెల్ తీద్దామని ప్రయత్నించాడు రామ్‌గోపాల్ వర్మ. మోహిత్ అహ్లావత్, నిషా కొఠారి జంటగా 2006లో 'శివ' పేరుతోటే వచ్చిన ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర దారుణంగా దెబ్బతింది. తర్వాత కాలంలో మోహిత్ అహ్లావత్ ఏమయ్యాడో కూడా తెలీదు.
'అంతం', 'గోవిందా గోవిందా' లాంటి సినిమాల తర్వాత నాగార్జునతో రెండేళ్ల క్రితం 'ఆఫీసర్' అనే మూవీ తీశాడు వర్మ. అది బాక్సాఫీస్ దగ్గర కోటి రూపాయలు కూడా వసూలు చేయలేక డిజాస్టర్ అయ్యింది. నాగ్ కెరీర్‌కు మాయని మచ్చగా మిగిలింది.
![]() |
![]() |