![]() |
![]() |

అనుష్క ఇటీవల తన చిత్రం 'నిశ్శబ్దం' విడుదలకు ముందు ట్విట్టర్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో సూపర్ హిట్ ఫిల్మ్ 'మిర్చి'లో వైరల్ అయిన ప్రభాస్, అనుష్క వెడ్డింగ్ పిక్చర్ గురించి మాట్లాడింది. అది చాలా స్వచ్ఛమైన ఫొటో అనీ, మూవీ ప్రి రిలీజ్ పోస్టర్‌గా దాన్ని ఉపయోగించారనీ ఆమె రాసింది.
క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో భాగంగా, ఓ అభిమాని 'మిర్చి'లోని ఆ ఫొటోను షేర్ చేసి, ఒక మాటలో దాని గురించి చెప్పమని అడిగాడు. "అది పెళ్లి షాట్ గురించి చర్చించుకుంటున్నప్పుడు తీసిన క్యాండిట్ పిక్చర్. 'మిర్చి'కి బ్యూటిఫుల్ పోస్టర్‌గా ఉపయోగపడింది. నా హృదయానికి దగ్గరైన సినిమా. యు.వి. క్రియేషన్స్ ఫస్ట్ మూవీ.. ప్రమోద్, వంశీ, విక్కీ.." అని రిప్లై ఇచ్చింది అనుష్క.
.jpg)
2013లో వచ్చిన 'మిర్చి' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయి, అప్పటికి ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ సినిమాతోటే కొరటాల శివ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. అందులో ప్రభాస్, అనుష్క జోడీని ప్రేక్షకులు బాగా మెచ్చారు. తర్వాత ఆ జోడీ 'బాహుబలి'తో ఎలాంటి చరిత్ర సృష్టించిందో మనకు తెలుసు. ఎన్ని సార్లు ఖండిస్తూ వచ్చినప్పటికీ ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది.
ప్రభాస్‌తో మరో సినిమా ఎప్పుడు చేస్తారని మరో అభిమాని అడిగాడు. "హాయ్.. కథకు మా జంట అవసరమయ్యేలా ఒక స్క్రిప్ట్ వస్తే, కచ్చితంగా చేస్తాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞురాలిని" అనేది ఆమె జవాబు.
.jpg)
కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న అనుష్క, 'నిశ్శబ్దం' సినిమా విడుదల సందర్భంగా సెప్టంబర్ 30న ట్విట్టర్ అకౌంట్‌ను స్టార్ట్ చేసింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఆమె ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యింది.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన 'నిశ్శబ్దం' మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని విమర్శకులు సైతం తిప్పికొట్టారు.
![]() |
![]() |