![]() |
![]() |

కర్ణాటక కోర్టులో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీకి చుక్కెదురైంది. కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసులో వీళ్ళిద్దరూ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం వారి బెయిల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. సంజన ఫ్రెండ్ రాహుల్ కి కుడా బెయిల్ ఇవ్వలేదు.
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు హీరోయిన్లను అరెస్టు చేసిన తర్వాత కర్ణాటక ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోని డ్రగ్స్ కేసులో పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. సినిమా స్టార్లు మాత్రమే కాదు... టీవీలో యాంకర్లుగా పని చేస్తున్న వాళ్లు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ యాంకర్ అకుల్ బాలాజీ, అనుశ్రీని బెంగళూరు సిసిబి పోలీసులు విచారించారు. అనుశ్రీకి సన్నిహితులైన కిషోర్, తరుణ్ తదితరులను అరెస్టు చేశారు. వీరు నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ వాడినట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది. దానికి సంబంధించి దర్యాప్తు జరుపుతున్నారు.
![]() |
![]() |