![]() |
![]() |

యాభై రోజుల పాటు కొవిడ్-19 వైరస్‌తో పోరాడి అలసి సెలవంటూ సెప్టెంబర్ 25న దివి నుంచి భువికి వెళ్లిపోయారు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దాంతో అశేష అభిమానులు హృదయాలు బద్దలయ్యాయి. కాగా రజనీకాంత్ లేటెస్ట్ ఫిల్మ్ 'అణ్ణాత్తే'లో బాలు ఓ ఎనర్జిటిక్ సాంగ్ పాడారని ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ వెల్లడించాడు. సినిమాలకు సంబంధించి ఇది బాలు చివరి పాట కావచ్చని భావిస్తున్నారు.
శివ డైరెక్ట్ చేస్తోన్న 'అణ్ణాత్తే' మూవీని 2021 పొంగల్‌కు రిలీజ్ చేయాలని నిర్మాతలు మొదట అనుకున్నారు. తమిళ పాటలను వివేక రాశారు. బాలుతో పాటను రికార్డ్ చేసిన అనుభవాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నాడు ఇమ్మాన్. బాలు, డైరెక్టర్ శివ, గేయ రచయిత వివేకతో కలిసి దిగిన ఫొటోలను అతను షేర్ చేశాడు. అది ఇంట్రడక్షన్ సాంగా, వేరేదా అనే విషయం ప్రస్తావించకుండా బాలు ఒక ఎనర్జిటిక్ నంబర్ పాడారని చెప్పాడు. కొద్ది నెలల క్రితం ఆ పాటను రికార్డ్ చేశారు. 'అణ్ణాత్తే' విడుదల దగ్గర పడుతున్న సమయంలో ఆ పాటను విడుదల చేస్తారని భావిస్తున్నారు.
బాలుతో ఫొటోను షేర్ చేసిన ఇమ్మాన్, "లెజెండ్స్‌కు మరణం లేదు! మా హృదయాల్లో మీరెప్పుడూ ఉంటారు! మన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ 'అణ్ణాత్తే' కోసం ఓ ఎనర్జిటిక్ సాంగ్ రికార్డింగ్ సందర్భంలో ఎస్పీబీ అంకుల్‌తో.." అని పోస్ట్ చేశాడు.
అయితే తన సినిమాల్లో ఇంట్రడక్షన్ సాంగ్ అంటే బాలునే పాడతారని రజనీకాంత్ ఇదివరకు తెలపడంతో, 'అణ్ణాత్తే'లో బాలు పాడిన పాట కూడా ఆయన ఇంట్రడక్షన్ సాంగే అని భావిస్తున్నారు.
![]() |
![]() |