![]() |
![]() |

టాలీవుడ్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి భారీ బడ్జెట్ యాక్షన్ ఫిలిమ్స్, లేదా మెలోడ్రామా అధికంగా ఉండే ఫ్యామిలీ సినిమాలు. అయితే తెలుగులో చెప్పుకోదగ్గ రొమాంటిక్ సినిమాలు కూడా ఇటీవలి కాలంలో బాగానే వచ్చాయి. నిజానికి ఇప్పటి యంగ్ హీరోలు హెవీ డ్రామా ఉండే సినిమాల కంటే మనసుకు ఉల్లాసాన్నిచ్చే లైటర్‌వీన్, ఫీల్ గుడ్ రొమాన్స్‌లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నిజానికి టాలీవుడ్‌లో ఎలాంటి విలక్షణ కథాంశాలతో సినిమాలు వచ్చాయనడానికి ఈ రొమాంటిక్ మూవీలే సాక్ష్యంగా నిలుస్తాయి. థియేటర్లు లేకపోవడంతో ఇప్పుడందరం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌నే ఆశ్రయిస్తున్నాం కాబట్టి.. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై స్ట్రీమ్ అవుతోన్న 10 మంచి తెలుగు రొమాంటిక్ సినిమాలేవో చూద్దాం...
1. పెళ్లిచూపులు (2016)
తారాగణం: విజయ్ దేవరకొండ, రీతూ వర్మ
దర్శకుడు: తరుణ్ భాస్కర్
ఐఎండీబీ రేటింగ్: 8.2
ఓటీటీ: ఎంఎక్స్ ప్లేయర్
2. భలే భలే మగాడివోయ్ (2015)
తారాగణం: నాని, లావణ్యా త్రిపాఠి
దర్శకుడు: మారుతి
ఐఎండీబీ రేటింగ్: 7.8
ఓటీటీ: డిస్నీ హాట్‌స్టార్
3. ఫిదా (2017)
తారాగణం: వరుణ్‌తేజ్, సాయిపల్లవి
దర్శకుడు: శేఖర్ కమ్ముల
ఐఎండీబీ రేటింగ్: 7.5
ఓటీటీ: డిస్నీ హాట్‌స్టార్
4. నిన్ను కోరి (2017)
తారాగణం: నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్
దర్శకుడు: శివ నిర్వాణ
ఐఎండీబీ రేటింగ్: 7.5
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
5. అల.. వైకుంఠపురములో (2020)
తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే
దర్శకుడు: త్రివిక్రమ్
ఐఎండీబీ రేటింగ్: 7.1
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
6. ఆర్ఎక్స్ 100 (2018)
తారాగణం: కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్
దర్శకుడు: అజయ్ భూపతి
ఐఎండీబీ రేటింగ్: 6.9
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
7. కేరింత (2015)
తారాగణం: సుమంత్ అశ్విన్, శ్రీదివ్య
దర్శకుడు: సాయికిరణ్ అడివి
ఐఎండీబీ రేటింగ్: 6.7
ఓటీటీ: డిస్నీ హాట్‌స్టార్
8. ప్రేమమ్ (2016)
తారాగణం: నాగచైతన్య, శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్
దర్శకుడు: చందు మొండేటి
ఐఎండీబీ రేటింగ్: 6.5
ఓటీటీ: ఎంఎక్స్ ప్లేయర్
9. ఛలో (2018)
తారాగణం: నాగశౌర్య, రష్మికా మందన్న
దర్శకుడు: వెంకీ కుడుముల
ఐఎండీబీ రేటింగ్: 6.4
ఓటీటీ: వూట్
10. కృష్ణ అండ్ హిజ్ లీల (2020)
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, షాలిని వడ్నికత్తి, సీరత్ కపూర్
దర్శకుడు: రవికాంత్ పేరెపు
ఐఎండీబీ రేటింగ్: 5.5
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
![]() |
![]() |