![]() |
![]() |

తండ్రీకూతుళ్ల అనుబంధం అనేది చాలా ప్రత్యేకమైంది. దాన్ని మాటల్లో అనువదించడం కష్టం. కుమార్తె భవిష్యత్తును తన ప్రేమతో తీర్చిదిద్దేవాడు తండ్రి. ఆమె కలలను సాధించుకోవడంలో అనుక్షణం ప్రోత్సాహాన్నిచ్చేవాడు, దాని కోసం ఎంతటి కష్టానికైనా ఓర్చేవాడు తండ్రి. కూతురికి తల్లి బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, కానీ కూతురి విజయాలకు పొంగిపోయి అమితంగా ఆనందించేది తల్లి కంటే తండ్రే. అలాంటి అనుబంధమే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్, అతని కుమార్తె నైసా మధ్య ఉంది.
సెప్టెంబర్ 27 డాటర్స్ డే. ఈ సందర్భంగా కుమార్తె నైసా కోసం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక చక్కని నోట్ రాశాడు అజయ్ దేవ్‌గణ్. యవ్వనం తొణికిసలాడుతున్న నైసా బ్యూటిఫుల్ పిక్చర్‌ను ఒకదాన్ని షేర్ చేసిన అజయ్, "నా కూతురు నైసాలో చాలా విషయాలున్నాయి. తను నా సునిశితమైన విమర్శకురాలు. నా అతిపెద్ద బలహీనత, బలం కూడా. తనిప్పుడు యంగ్ అడల్ట్ కానీ కాజోల్‌కూ, నాకూ ఎప్పటికీ బేబీ గాళే." అని పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కు స్పందించిన నైసా తల్లి కాజోల్ కూడా "మీ టూ" అని కామెంట్ పెట్టింది.

నైసా ప్రస్తుతం చదువు నిమిత్తం సింగపూర్‌లో ఉండగా, ఆమెకు తోడుగా తల్లి కాజోల్ కూడా అక్కడే ఉంటోంది. ఇక్కడ ముంబైలో కొడుకు యుగ్‌తో అజయ్ దేవ్‌గణ్ కాలం గడుపుతున్నాడు.

![]() |
![]() |