![]() |
![]() |

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు దీపికా పడుకోనే, రకుల్‌ప్రీత్ సింగ్, సారా అలీఖాన్‌ల సెల్‌ఫోన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకుందని సమాచారం. ఈ మేరకు ఎన్డీటీవీ ఓ కథనం ప్రసారం చేసింది. అలాగే సుశాంత్‌సింగ్ టాలెంట్ మేనేజర్ జయ సాహా, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా సెల్‌ఫోన్లను కూడా ఎన్సీబీ స్వాధీనం చేసుకుందని, వాటన్నింటినీ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారనీ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. వ్యక్తిగతంగా డ్రగ్స్‌ను వాడేవారిపైనే కాకుండా నార్కోటిక్స్ పదార్థాల సప్లైపైనా ఎన్సీబీ దృష్టి సారించింది.
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ.. డ్రగ్స్ కోణంతో కనెక్షన్ ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్లు దీపికా పడుకోనే, రకుల్‌ప్రీత్ సింగ్, సారా అలీఖాన్‌లను ఇంటరాగేట్ చేసింది. ఈ కేసును సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తున్నాయి. ఎన్సీబీ ఇంటరాగేషన్‌లో తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని దీపిక చెప్పింది. అయితే డ్రగ్ చాట్ చేసినట్లు అంగీకరించింది. అలాగే సారా అలీఖాన్ కూడా తాను డ్రగ్స్ వాడినట్లు వచ్చిన ఆరోపణలను విచారణ సందర్భంగా ఖండించింది. శనివారం 'సాహో' హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను కూడా ఎన్సీబీ ప్రశ్నించింది.
తాజా సమాచారం ప్రకారం సుశాంత్‌సింగ్‌తో కలిసి బ్యాంకాక్ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలిపిన సారా అలీఖాన్.. అతని ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు ఒప్పుకుంది. ఆ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీల సమాచారం కూడా ఆమె ఎన్సీబీ అధికారులకు వెల్లడించిందని చెబుతున్నారు.
![]() |
![]() |