![]() |
![]() |

పద్దెనిమిది సంవత్సరాల క్రితం బచ్చన్లు, కపూర్ల మధ్య స్నేహం బంధుత్వంగా మారనున్న శుభ తరుణంలో.. అభిషేక్ బచ్చన్, కరిష్మా కపూర్ పెళ్లి కోసం దేశం ఎదురుచూస్తున్న వేళ.. షాకింగ్ న్యూస్.. ఆ ఇద్దరి నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన.. రెండు కుటుంబాల అభిమానులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు, బాధపడ్డారు. ఐదేళ్లపాటు ప్రేమలో మునిగి తేలి, జీవితాంతం కలిసి బతుకుదామనే కలలు కన్న అభిషేక్, కరిష్మాల హృదయాలు బద్దలయ్యే ఉంటాయి. నేటి యూత్‌కు వాళ్ల కథ తెలిసి ఉండకపోవచ్చు. ఇది నిజం.
1997లో అభిషేక్ సోదరి శ్వేతా బచ్చన్ వివాహం జరిగింది. ఆ వివాహ వేడుకలో అభిషేక్, కరిష్మాల హృదయాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నాయి. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ప్రేమలో మునిగి తేలారు. అయితే ఐదేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని వాళ్లు బయటి ప్రపంచానికి తెలియనియ్యలేదు. 2002 అక్టోబర్‌లో అమితాబ్ బచ్చన్ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో అనూహ్యంగా అభిషేక్, కరిష్మాల ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించారు. దాంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. "బచ్చన్ కుటుంబంలో భాగం కానుండటం వండర్‌ఫుల్‌గా అనిపిస్తోంది" అని కరిష్మా ఉద్వేగానికి గురైంది.
అప్పట్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, "సడన్‌గా అభిషేక్ నాకొక డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేసి, నన్ను పెళ్లి చేసుకుంటావా? అనడిగాడు. నేనెలా నో చెప్పగలను! అభిషేక్‌లో నేను సరైన వ్యక్తిని చూశానని ఫీలయ్యాను. పైగా బచ్చన్ ఫ్యామిలీ కంటే బెటర్ ఫ్యామిలీని నేను కోరుకోను" అని చెప్పింది కరిష్మా.

అలాంటిది.. వారి నిశ్చితార్ధం కూడా ఆకస్మికంగా రద్దు కావడం అందరికీ మరో షాక్. దీనిపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. కరిష్మా తల్లి బబిత వల్లే వారి పెళ్లి ఆగిపోయిందనే వాదన బలంగా వినిపించింది. అప్పటికే భర్త రణధీర్ కపూర్‌తో విడిపోయిన ఆమె తన ఇద్దరు కూతుళ్లు.. కరిష్మా, కరీనాను సింగిల్ మదర్‌గా పెంచుతూ వచ్చారు. కరిష్మా, అభిషేక్ నిశ్చితార్ధం జరిగిన కాలంలో కెరీర్‌లో కరిష్మా పీక్ స్టేజ్‌లో ఉండగా, అభిషేక్ ఒక బడ్డింగ్ యాక్టర్ స్టేజ్‌లోనే ఉన్నాడు. మరోవైపు అమితాబ్ ప్రొడక్షన్ కంపెనీ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉంది. దాంతో తన కుమార్తె భవిష్యత్తు విషయంలో బబిత ఆందోళన చెందారనీ, ఆర్థికంగా సురక్షితంగా ఉన్న కుటుంబాలకు తన కుమార్తెలను కోడళ్లుగా పంపాలనీ ఆమె భావించారనీ, అందుకే ఆ పెళ్లి ఆగిపోయిందనీ చెప్పుకున్నారు.
దీనికి సమాంతరంగా ఇంకో వాదన కూడా తెరపైకి వచ్చింది. తన కుమారుడితో పెళ్లి తర్వాత కరిష్మా కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ఇంటిపట్టునే ఉండాలనీ, అలాగే కరిష్మా జీవితంలో బబిత జోక్యం ఉండకూడదనీ జయా బచ్చన్ షరతులు పెట్టారనీ, దీనికి ఇష్టపడకపోవడం వల్లే ఆ పెళ్లికి బబిత అంగీకరించలేదనీ అనుకున్నారు. మొత్తానికి పెద్దల పంతానికి అభిషేక్, కరిష్మా ప్రేమ బంధం బలైపోయింది. ఇంత జరిగినా, ఇన్నేళ్ల తర్వాత వాళ్లిద్దరి మధ్య ఎలాంటి ద్వేషభావం లేదని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత తన కూతురు కరిష్మాను 2003 సెప్టెంబర్‌లో ఢిల్లీకి చెందిన రిచ్ బిజినెస్‌మ్యాన్ సంజయ్ కపూర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు బబిత. కానీ ఆ ఇద్దరి కాపురం సక్రమంగా జరగలేదు. ఎప్పుడూ గొడవలే. చివరకు 2016లో డివోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు సింగిల్ మదర్‌గా కాలం గడుపుతోంది కరిష్మా. మరోవైపు, ఐశ్వర్యా రాయ్‌ను పెళ్లాడిన అభిషేక్ హ్యాపీగా మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ, కూతురు ఆరాధ్యతో ఆడుకుంటూ కాలం గడుపుతున్నాడు.

![]() |
![]() |