![]() |
![]() |

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం స్నేహితులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల జలపాతాన్ని సందర్శించారు. ఈ విహారయాత్ర వివాదాస్పదమైంది. ముఖ్యంగా విమర్శల పాలైంది. దీనికి కారణం కరోనా అని చెప్పుకోవాలి. దానికి తోడు అటవీ అధికారుల అత్యుత్సాహం కూడా ఓ కారణమే. అసలు ఏమైంది? అని పూర్తి వివరాల్లోకి వెళితే...
తెలంగాణాలో ఎత్తైన జలపాతంగా కుంటాలకు పేరుంది. ప్రతి వర్షాకాలంలో చాలామంది ఈ జలపాతాన్ని చూడటానికి వస్తారు. అయితే, ఈ ఏడాది కరోనా నేపథ్యంలో సందర్శకులను జలపాతం వద్దకు అధికారులు అనుమతించడం లేదు. అల్లు అర్జున్, అతడి వెంట ఉన్న స్నేహితులకు అటవీ అధికారులు దగ్గరుండి జలపాతాన్ని చూపించడంతో పాటు ప్రత్యేకతలను వివరించారు. దాంతో సామాన్యుల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడూ సెలబ్రిటీలపై ఇతర హీరోల అభిమానులు కొందరు విమర్శలు చేస్తుంటారు. కానీ, ఓ విహారయాత్ర వివాదాస్పదం అవ్వడం అల్లు అర్జున్ విషయంలో ఇదే తెలిసారి అనుకుంట.
![]() |
![]() |