![]() |
![]() |

సోషల్ మీడియాలో అర్ధనగ్న ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోయే బాలీవుడ్ సెక్సీ తార పూనమ్ పాండే పెళ్లి చేసుకుంది. బాయ్‌ఫ్రెండ్ శామ్ బాంబేను ఆమె వివాహమాడింది. శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పెళ్లిరోజుకు సంబంధించిన కొన్ని పిక్చర్లను ఆమె షేర్ చేసింది. సాధారణంగా తను కనిపించే దానికి పూర్తి భిన్నంగా సంప్రదాయబద్ధమైన డ్రస్సులో ఆమె దర్శనమిచ్చింది.
.jpg)
పూనమ్ పూల డిజైన్‌తో ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాను ధరించగా, శామ్ కూడా అదే తరహా షేర్వాణీలో కనిపించాడు. ఏడు జీవిత కాలాల పాటు నీతో కలిసి నడవడానికి ఎదురుచూస్తున్నా అని కవితాత్మకంగా పూనమ్ పోస్ట్ చేయగా, శామ్ బాంబే తన ఇన్‌స్టాలో ఎప్పటికీ కలిసుండటానికి ఇది ప్రారంభం అని రాశాడు. జూలైలో ఆ ఇద్దరి నిశ్చితార్ధం జరిగింది.
.jpg)
![]() |
![]() |