![]() |
![]() |

"ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు" అని పెద్దలు అన్నారు. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం ఖర్చుతో కూడిన వ్యవహారాలు అని సామెత వెనుక ఉన్న అర్థం. ఖర్చు మాత్రమే కాదు... బోల్డంత శ్రమ కూడా ఉంటుంది. శ్రమ వల్ల అలసట వచ్చి శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. పెళ్లికి ముందు నితిన్ కూడా కల్యాణ మండపానికి వెళుతున్న సమయంలో కారులో ఓ కునుకు తీశారు.
నితిన్, షాలిని వివాహం ఆదివారం రాత్రి హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగింది. బంధుమిత్రులు తక్కువ మంది మాత్రమే హాజరయినప్పటికీ... పెళ్లంటే బోల్డంత హడావిడి ఉంటుంది కదా. ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది. పెళ్లికి రెండు రోజుల ముందు పెళ్లి కొడుకు ఫంక్షన్ జరిగింది. దానికి కొంతమంది అతిథులు వచ్చారు. తరవాత సంగీత్ వేడుక జరిగింది. వీటన్నిటి మధ్య 'రంగ్ దే' టీజర్ డబ్బింగ్ ఒకటి. బహుశా... నితిన్ చాలా అలసిపోయి ఉంటారు. అందుకని, కల్యాణ మండపానికి కారులో వెళుతున్నప్పుడు కాస్త సమయం దొరకడంతో కునుకు తీశారు. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించారు.
![]() |
![]() |