![]() |
![]() |

తెలుగునాట త్వరలో స్టార్ మా ఛానల్‌లో 'బిగ్ బాస్' రియాలిటీ షో నాలుగో సీజన్ మొదలు కానుంది. దాంతో సెలక్షన్ ప్రకియను నిర్వాహకులు వేగవంతం చేశారు. ప్రస్తుతం వార్తల్లో ఉంటున్న సెలబ్రిటీలను హౌస్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కాంట్రవర్షియల్ క్యారెక్టర్లతో పాటు కత్తిలాంటి అమ్మాయిలకు కూడా చోటు ఇవ్వాలనుకుంటున్నారు. అందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఓటీటీ సినిమా 'థ్రిల్లర్'లో నటిస్తున్న హాట్ బ్యూటీ అప్సరా రాణి అలియాస్ అంకితా మహారాణాను సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నట్టు టాక్. ఆమె ఎంత డిమాండ్ చేస్తుందో మరి?
అప్సర అంటే హాట్ హాట్ అందాలు ప్రేక్షకులకు గుర్తొస్తాయి. వర్మ 'థ్రిల్లర్' కంటే ముందు '4 లెటర్స్', 'ఉల్లాల ఉల్లాల' సినిమాల్లోనూ ఆమె హాట్‌గా నటించింది. అయితే, ఎవరూ అంతగా గుర్తించలేదు. వర్మ వల్ల బోల్డంత ప్రచారం దక్కింది. ఆఫర్లు వస్తున్నాయట. వర్మ తీసిన 'నగ్నం'లో హీరోయిన్ శ్రీ రాపాకకు సైతం 'బిగ్ బాస్' హౌస్ నుండి ఆఫర్ వచ్చిందనీ, అయితే ఆమె ఎక్కువ డిమాండ్ చేయడంతో పక్కన పెట్టారని టాక్.
![]() |
![]() |