![]() |
![]() |

టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన హీరో నితిన్ ఆదివారం రాత్రి ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు షాలిని మెడలో మూడు ముళ్లు వేసి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాడు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 8.30 గంటలకు కన్నుల పండుగగా జరిగిన వేడుకలో నితిని, షాలిని ఒక్కటయ్యారు. రెడ్ కలర్ షేర్వానీలో నితిన్ ఆకట్టుకోగా, క్రీమ్ కలర్‌పై గోల్డ్ కలర్ డిజైన్‌తో ఉన్న సంప్రదాయ సిల్క్ శారీలో షాలని మెరిసిపోయారు.
ప్రభుత్వ కొవిడ్-19 నియమ నిబంధనల ప్రకారం జరిగిన ఈ పెళ్లి సందడిలో రెండు కుటుంబాలవారితో పాటు అతి కొద్దిమంది సన్నిహితులు, స్నేహితులు పాలు పంచుకున్నారు. నితిన్ పెళ్లికి హాజరైన వారిలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత, సినీ హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, కార్తికేయ ఉన్నారు.





![]() |
![]() |