![]() |
![]() |

మునుపటి సినిమా 'అశ్వథ్థామ' చిత్రంలోనే దృఢమైన శరీరంతో కనిపించి ఆశ్చర్యపరచిన యంగ్ హీరో నాగశౌర్య.. ఇప్పుడు తను నటిస్తోన్న 20వ సినిమా కోసం మరింతగా బాడీని మార్చుకున్నాడు. కండలవీరునిగా తయారయ్యాడు. ముడివేసిన జుట్టు, పొడవుగా పెంచిన గడ్డం, టాప్‌లెస్ ఎయిట్-ప్యాక్ బాడీతో విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించి, దేనికో సూటిగా గురిపెట్టినట్లున్ననాగశౌర్య వారియర్ ఫస్ట్ లుక్ నిజంగానే ఆకట్టుకుంటోంది. అతని ఎడమ చేతిపై బాణం టాట్టూ కూడా ఉంది. ఏషియన్ గ్రూప్స్ చైర్మన్, తెలుగు ఫిల్మ్‌చాంబర్ ప్రెసిడెంట్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి అధినేత నారాయణ్ దాస్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా సోమవారం ఈ లుక్‌ను రిలీజ్ చేశారు. సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్‌లో ఈ మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
ఇదివరకు రిలీజ్ చేసిన సూపర్ ఫిట్ గా వెనుకనుండి కనిపిస్తున్న నాగశౌర్య20 ప్రీ లుక్ విశేష స్పందన రాబట్టి ఫస్ట్ లుక్ మీద అంచనాలు పెంచిన విషయం తెలిసిందే..ఆ అంచనాలను అందుకునేలా ఫస్ట్‌లుక్‌ని డిజైన్ చేసింది మూవీ యూనిట్. సరికొత్తగా కనిపిస్తోన్న నాగశౌర్య లుక్ సూపర్బ్ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతి సినిమాలో తన స్పెషాలిటీని నిరూపించుకుంటూ 'ఛలో', 'ఓ బేబీ', 'అశ్వథ్థామ' వంటి హిట్స్‌తో దూసుకెళ్తున్నయంగ్ హీరో నాగశౌర్య హీరోగా ఆసక్తికరమైన ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - "సిక్స్ ప్యాక్ బాడీతో వారియర్ పోజ్ లో నిల్చొని ఉన్న నాగశౌర్య20 ఫస్ట్‌లుక్ చాలా బాగుంది. బరువు పెరగడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది అమేజింగ్ కమిట్‌మెంట్ తో నాగశౌర్య తన లుక్‌ని మార్చుకున్నందుకు ఆయనను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. నాగశౌర్య సినిమాల్లో ఒక హాట్ కేక్‌లా ఈ సినిమా ఉండబోతుంది అనిపిస్తోంది. బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్లు చేస్తూ కూల్ గై ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్‌కి మారడం రైట్ చాయిస్ అనుకుంటున్నాను. నేను 'చలో',' ఓ బేబీ' సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో నాగశౌర్య నటన నాకు నచ్చింది. అలాగే తను ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ కూడా చాలా బాగుంటున్నాయి" అన్నారు.
నాగశౌర్య, కేతికశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి, సంగీతం: కాలబైరవ, ఎడిటర్: జునైద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి.

![]() |
![]() |