![]() |
![]() |

తమిళ చిత్రసీమలో అత్యంత ప్రతిభావంతులైన యాక్టర్లలో సూర్య, నయనతార ముందు వరుసలో నిలుస్తారు. ఎలాంటి పాత్రనైనా తమ నటనా సామర్థ్యంతో ఉన్నత స్థాయికి తీసుకురాగల నేర్పరులు ఆ ఇద్దరూ. అందుకే ఒక తమిళ ఎపిక్‌లో ఆ ఇద్దరినీ చూడాలనుకుంటున్నారు మ్యూజిక్ మ్యాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్. ఇటీవల ఆయనను కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఇంటర్వ్యూ చేశాడు.
ఆ ఇంటర్వ్యూలో ఆ ఇద్దరూ అనేక విషయాలు మాట్లాడుకున్నారు. క్వారంటైన్‌లో హెయిర్ స్టైల్ దగ్గర్నుంచీ, తమ తర్వాతి సినిమాల దాకా ఉన్నాయి. ఆ సందర్భంగా తమిళ ఇతిహాసం 'శిలప్పదికారమ్' ఆధారంగా తీసే సినిమాలో నయనతార, సూర్యలను ప్రధాన పాత్రల్లో చూడాలనుకుంటున్నానని రెహమాన్ చెప్పారు. ఆ సినిమా ఆణిముత్యాల్లాంటి పాత సినిమాల తరహాలో మ్యూజికల్ ఫిల్మ్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దానికి విఘ్నేశ్ సరదాగా ఈ విషయాన్ని నయనతారకు చెబుతానని నవ్వేశాడు.
కాగా మణిరత్నం తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'కు పని చేస్తూ థ్రిల్ ఫీలవుతున్నానని రెహమాన్ తెలిపారు. "పొన్నియన్ సెల్వన్‌ను రిక్రియేట్ చేయాలని మణి సార్ కానీ, నేను కానీ అనుకోవడం లేదు. ఇది మాకు క్లిష్టమైన వ్యవహారం. మేం దాన్ని కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నాం" అని ఆయన అన్నారు. ఆ సినిమా చూసి ప్రేక్షకులు తప్పకుండా వండర్‌ఫుల్ అని ఫీలవుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
![]() |
![]() |